Asianet News TeluguAsianet News Telugu

నంద్యాలలో సీబీఐ సోదాలు :నంది పైపుల కంపెనీపై కేసు

నంద్యాలలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకొన్నారని మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కి చెందిన కంపెనీపై అధికారులు కేసు నమోదు చేశారు.

CBI raids  Former MP SPY Reddys house
Author
Amaravathi, First Published Dec 2, 2021, 4:17 PM IST

నంద్యాల: కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో సీబీఐ అధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహించారు. తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకొన్నారనే కారణంతో మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కొడుకుపై CBI కేసు నమోదు చేసింది. 2019 ఏప్రిల్ మాసంలో మాజీ spy Reddy కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ అధికారులు  సోదాలు నిర్వహించారు. రుణాలు చెల్లించడంలో విఫలమైనందుకు ఎస్పీవై రెడ్డిపై కేసు నమోదైంది. నంది గ్రూప్ నకు చెందిన కొన్ని పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఎంపీ తన నంది గ్రూప్ ఇండస్ట్రీస్ కోసం sbi,   సిండికేట్ బ్యాంకుతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల నుండిత రుణాలు తీసుకొని ఆ నిధులు చెల్లించకపోవడంతో సీబీఐకి బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసింది.

also read:శుక్రవారం రాత్రే గ్యాస్ లీకేజీని గుర్తించాం... అయినా: ఎస్పీవై ఆగ్రో కెమికల్స్ ఎండీ

1978లో Nandi  కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ కంపెనీ పీవీసీ  పైపుల తయారీని ప్రారంభించింది. అనుబంధ పైపుల తయారీకకి విస్తరించింది. ఈ గ్రూప్ వ్యవసాయ పైపులు, కేసింగ్ పైపులు, ప్లంబింగ్ పైపులు, డ్రైనేజీ పైపులు తయరాు చేయడం ప్రారంభించింది. ఎస్పీవై రెడ్డి రెండు దపాలు ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి ycp నుండి విజయం సాధించి ఆ తర్వాత tdp లో చేరాడు.  2019 మే మాసంలో ఎస్పీవై రెడ్డి మరణించారు.2019 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన జససేన అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే ఎస్పీవై రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మోసం చేశారని నమోదైన కేసుల ఆధారంగా సీబీఐ అధికారులు సోదాలు చేసినట్టుగా సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios