Asianet News TeluguAsianet News Telugu

జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్‌లు... విచారణకు గైర్హాజరు, వైసీపీ కౌన్సిలర్‌ ఇంటికి సీబీఐ

జడ్జిలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హిందూపురం వైసీపీ కౌన్సిలర్ మారుతీ రెడ్డి. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో సీబీఐ అధికారులు హిందూపురం వచ్చారు. 
 

cbi officials came to hindupur for arrest ysrcp leader in derogatory comments on judges case
Author
First Published Sep 12, 2022, 8:55 PM IST

జడ్జిలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు హిందూపురం వైసీపీ కౌన్సిలర్ మారుతి రెడ్డి. అయితే ఈ కామెంట్స్‌ను తీవ్రంగా పరిగణించింది కోర్ట్. దీనిపై సీబీఐ విచారణకు సైతం ఆదేశించింది కోర్ట్. 12న విచారణకు రావాలని ఈ నెల 7న మారుతిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారులు సోమవారం హిందూపురానికి వచ్చారు. అయితే కౌన్సిలర్ అందుబాటులో లేకపోవడంతో సీబీఐ అధికారులు ఆయను తీవ్రంగా గాలిస్తున్నారు. 

ALso REad:‘‘నాపై కేసు కొట్టివేయండి..’’: ఏపీ హైకోర్టులో ఆమంచి క్వాష్ పిటిషన్

కాగా.. ఏపీలో అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ జగన్ స‌ర్కారు వ‌రుస‌గా తీసుకుంటున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు వాటికి వ్య‌తిరేకంగా తీర్పులు ఇస్తూ వస్తోంది. దీంతో వైసీపీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు సోష‌ల్ మీడియా వేదిక‌గా హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై ఏపీ సీఐడీ ఇప్పటికే కేసు న‌మోదు చేసి విచారణ చేస్తున్నప్పటికీ... సీఐడీ విచార‌ణ‌తో సంతృప్తి చెంద‌ని న్యాయస్థానం... సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios