అమరావతి:  జడ్జిలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లపై దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. 

హైకోర్టు జడ్జిలపై , కోర్టు తీర్పులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టు జడ్జికి లేఖ రాసిన న్యాయవాది లక్ష్మీనారాయణను ఆదివారంనాడు  సీబీఐ అధికారులు విచారించారు.

also read:ఏపీలో జడ్జిలపై అభ్యంతరకర పోస్టులు: సీబీఐ కేసులు

సీబీఐ అధికారులకు  న్యాయవాది లక్ష్మీనారాయణ తన వద్ద ఉన్న ఆధారాలను అందించారు.ఈ విషయమై ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ ఒక్క కేసుగా సీబీఐ నమోదు చేసింది. సీఐడీ నమోదు చేసిన కేసులను ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకొంది.గంటపాటు సీబీఐ అధికారులు లక్ష్మీనారాయణను విచారించారు. తన వద్ద ఉన్న ఆధారాలను కూడ సీబీఐ అధికారులకు అందించినట్టుగా లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు.

హైకోర్టు తీర్పులపై వైసీపీకి చెందిన కొందరు నేతలు, ప్రజా ప్రతినిధులు తీవ్రమైన విమర్శలు చేశారు.ఈ విమర్శలపై దాఖలైన పిల్ పై ఏపీ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సీఐడీ దర్యాప్తునకు బదులుగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

ఈ విషయమై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేసింది.  ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ప్రారంభించింది.ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణను సీబీఐ అధికారులు ఇవాళ విచారించారు.