Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో జడ్జిలపై అభ్యంతరకర పోస్టులు: సీబీఐ కేసులు

న్యాయమూర్తులు, న్యాయమూర్తుల తీర్పులపై అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకి విచారిస్తున్న విషయం తెలిసిందే.
 

CBI files cases on defamatory posts on social media against judges lns
Author
Amaravathi, First Published Nov 16, 2020, 6:24 PM IST


అమరావతి: న్యాయమూర్తులు, న్యాయమూర్తుల తీర్పులపై అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకి విచారిస్తున్న విషయం తెలిసిందే.

ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం 16 మందిపై కేసులు నమోదయ్యాయి. హైకోర్టు జడ్జిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

also read:ఏపీ హైకోర్టు సంచలనం: సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసు సీబీఐకి అప్పగింత

సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐ యధాతథంగా కేసులు నమోదు చేసినట్టుగా సీబీఐ తెలిపింది.నిందితులు ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర మాధ్యమాల్లో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్టుగా సీబీఐ ప్రకటించింది.

నిందితుల్లో ముగ్గురు విదేశాల నుండి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్టుగా సీబీఐ తెలిపింది.ఐటీ చట్టంలోని సెక్షన్ 154, 153 ఏ, 504,505 ల ప్రకారంగా సీఐడీ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్ లను ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్టుగా సీబీఐ ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios