వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐ పెద్ద పోరాటమే చేస్తోంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదంటూ శుక్రవారం సిబిఐ న్యాయవాది కోర్టులో వాదించారు. 11 కేసుల్లో జగన్ నిందుతుడని సిబిఐ వాదించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐ పెద్ద పోరాటమే చేస్తోంది. నవంబర్ 2వ తేదీనుండి జగన్ పాదయాత్ర చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. కేసుల విచారణలో భాగంగా ప్రతీ శుక్రవారం జగన్ ప్రస్తుతం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతున్నారు.
పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని తనకు కోర్టుకు హాజరవ్వటంలో వ్యక్తిగత మినమాయింపును ఇవ్వాలంటూ జగన్ పిటీషన్ వేసారు కదా? ఆ పిటీషన్ కు వ్యతిరేకంగానే సిబిఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది.
ఎట్టి పరిస్ధితుల్లోనూ జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదంటూ శుక్రవారం సిబిఐ న్యాయవాది కోర్టులో వాదించారు. 11 కేసుల్లో జగన్ నిందుతుడని సిబిఐ వాదించింది. కేసుల విచారణ కీలక దశకు చేరుకున్నది కాబట్టి జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదని సిబిఐ గట్టిగా పట్టుబట్టింది.
రాజకీయ కారణాలతో ఏకంగా ఆరు నెలలు మినహాయింపు సరికాదని సిబిఐ న్యాయవాదన్నారు. ఇంకోవైపేమో జగన్ తనకు వ్యక్తిగత మినహాయింపు ఎందుకు కోరుకుంటున్నారో జగన్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. ఇరు వైపుల వాదన విన్నన్యాయమూర్తి కేసును ఈనెల 23వ తేదీకి వాయిదా వేసారు.
