Asianet News TeluguAsianet News Telugu

ఆమంచికి సీబీఐ షాక్: సోషల్ మీడియాలో పోస్టులపై విచారణకు రావాలని నోటీసులు

ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో కోర్టుపై అనుచిత పోస్టులు పెట్టారనే అభియోగాలపై సీబీఐ నోటీసులిచ్చింది.

CBI issues notice to chirala former MLA Amanchi krishna mohan lns
Author
Chirala, First Published Feb 1, 2021, 3:58 PM IST

అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో కోర్టుపై అనుచిత పోస్టులు పెట్టారనే అభియోగాలపై సీబీఐ నోటీసులిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

 

విశాఖపట్టణంలోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఈ విషయమై విచారణ నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పులు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై సీఐడీ విచారణ సరిగా లేదని విచారణను సీబీఐ అప్పగించింది ఏపీ హైకోర్టు.

ఈ విషయమై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. పలువురు వైసీపీ నేతలు న్యాయవ్యవస్థను కించపర్చేలా విమర్శలు చేశారని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ విషయమై విచారణ చేసిన కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఈ విషయమై గత ఏడాది నవంబర్  మాసంలో 16 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ.సీఐడీ నమోదు చేసిన కేసులను యథాతథంగా నమోదు చేసినట్టుగా సీబీఐ తెలిపింది.ఐటీ సెక్షన్లలోని 154, 504, 505 సెక్షన్ల ప్రకారంగా సీఐడీ  నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్ ను ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్టుగా సీబీఐ ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios