Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసు: 30వ రోజు విచారణ.. కీలక వ్యక్తులను ప్రశ్నిస్తోన్న సీబీఐ

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్‌ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 30వ రోజు కొనసాగుతోంది. నెల రోజుల నుంచి అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు ప్రస్తుతం కీలక వ్యక్తుల నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు.

cbi inquires ys viveka murder case ksp
Author
Amaravathi, First Published Jul 6, 2021, 2:45 PM IST

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్‌ జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 30వ రోజు కొనసాగుతోంది. నెల రోజుల నుంచి అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు ప్రస్తుతం కీలక వ్యక్తుల నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. వివేకా హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారని సిట్‌ అరెస్టు చేసిన ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇదయతుల్లా, డ్రైవర్‌ ప్రసాద్‌, వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఈ ఐదుగురిని పులివెందుల గెస్ట్‌హౌస్‌లో విచారించిన అధికారులు ఇవాళ మరోసారి విచారణకు పిలిచారు. ఈ ఉదయం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి వచ్చిన ఈ ఐదుగురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

Also Read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: ఎర్రగంగిరెడ్డి సహా నలుగురి విచారణ

కాగా, వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు దాటినా కూడ ఇంతవరకు నిందితులను గుర్తించకపోవడంపై ఆయన కూతురు సునీతా రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సీబీఐ అధికారులకు ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 2న వినతి పత్రం సమర్పించారు.  ఆ తర్వాత అదే నెల ఏప్రిల్ 12న  సీబీఐ అధికారులు విచారణను ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios