Asianet News TeluguAsianet News Telugu

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కస్టమ్స్ అధికారులు: కేసు నమోదు చేసిన సీబీఐ


ఎర్ర చందనం స్మగ్లింగ్ లో కస్టమ్స్ అధికారుల పాత్రను సీబీఐ తేల్చింది.  కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముగ్గురు కస్టమ్స్ అధికారులతో పాటు ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల పాత్రను కూడా  ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

CBI  Files Case Against Customs officers Red Sandalwood smuggling
Author
New Delhi, First Published Dec 31, 2021, 11:08 AM IST

అమరావతి: ఎర్ర చందనం smugglingలో కస్టమ్స్ పాత్ర ఉన్నట్టుగా CBI   అధికారులు తేల్చారు. ఈ మేరకు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.  ముగ్గురు కస్టమ్స్ అధికారులతో పాటు  Red Sandalwood స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఎర్రచందనం దుంగలను పైపులంటూ  నిందితులు సరఫరా చేస్తున్నారు. నిందితులు సతీష్ కుమార్, నజీబ్ లకు సహకరించిన ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహకరించినట్టుగా సీబీఐ పేర్కొంది. కస్టమ్స్ సూపరింటెండ్ వెంకటేష్, అనంత పద్మనాభ రచావులపై కేసు నమోదు చేసింది. బెంగుళూరు ఎయిర్ పోర్టులో ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న రవీందర్ పవార్ పై కూడా సీబీఐ  కేసు నమోదు చేసింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్‌కి చిత్తూరు కేంద్రం

ఎర్రచందనం స్మగ్లింగ్ కు చిత్తూరు జిల్లాలోని నాగపట్ల అడవి సింహద్వారాం. దశాబ్దాల కిందటే ఇక్కడ నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా అయ్యేది. గతంలో చెన్నయ్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్ళుతుండేది కానీ, ప్రస్తుతం దారులు చాలా పెరిగిపోయాయి. ఎయిర్‌పోర్టుల ద్వారా కూడా రవాణా అవుతోంది. 

 చెన్నై పోర్టు నుంచి రేణిగుంట, కడప, కర్నూలుల మీదుగా హైదరాబాద్ లోని నిజాం సంస్థానానికి చేరేది. అయితే 18 శతాబ్దం మొదట్లో ఈస్టిండియా కంపెనీ భారతదేశానికి వచ్చిన తరువాత రైల్వే లైన్లపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా లైన్ల ఏర్పాటు కోసం ఎర్రచందనం కొయ్యను వినియోగించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సిమెంటు దిమ్మెల స్థానంలో ఎర్రచందనం కొయ్యలను వినియోగించే వారు. అంటే ఆ కొయ్య పటిష్టత అంతగా ఉండేది. అందుకోసం అడవుల్లో దాదాపుగా 60 కి.మీ. వరకూ అడవుల్లో ఎడ్ల బండ్ల కోసం దారులు ఏర్పాటు చేశారు. ఎడ్ల బండ్ల ద్వారానే ఈ కొయ్యలను తీసుకెళ్లి రైల్వే లైను తయారు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటినే లండన్ కు కూడా తరలించారు. 

 వేలాది మంది కూలీలలో వీరప్పన్ చందనం స్మగ్లర్‌గా మారారు. ఇటు తమిళనాడు, కర్నాటక, కేరళ అడవుల్లో స్మగ్లింగ్ కింగ్‌లా మారారు. ప్రభుత్వాలకు సవాల్‌గా నిలిచారు. ఇందులో భాగంగా వంశపారంపర్యంగా వచ్చే ఉడ్ కట్టర్లు తయారయ్యారు. వీరందరూ జవ్వాది మలై , జవ్వాది కొండ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. తమిళనాడులోని తిరునల్వేలి, ధర్మపురి ప్రాంతాలకు చెందిన వీరు మెల్లగా శేషాచల కొండల వైపు మళ్ళారు. 

also read:కడపలో ఫారెస్ట్ అధికారులపై తమిళ కూలీల దాడి: పారిపోతూ ఒకరి మృతి, ఇధ్దరికి గాయాలు

మొదట్లో రేషన్ బియ్యం, చక్కెర, కిరోసిన్, పెట్రోల్, కొన్ని సార్లు కూరగాయలను ఇటు వైపు నుంచి అటు వైపుకు,  అటువైపు నుంచి ఇటు వైపుకు అక్రమ రవాణా చేసేవారు. చిత్తూరు, పలమనేరు, నగరి, జిడీ నెల్లూరు ఏకాంబర కుప్పం ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్ రుచి మరిగారు. వీళ్లు తమిళనాడు నుంచి వీరప్పన్ ప్రభావిత ప్రాంతాలలోని ప్రొఫెషనల్ వుడ్ కట్టర్లను రంగంలోకి దింపారు. వారినే ఎన్నుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. 

వారు చెట్లు నరకడం, డ్రెస్సింగ్ చేయడంలో దిట్టలు కాబట్టి వారిని ఎన్నుకుని శేషాచలం వైపు మళ్ళించారు. ధర్మపురి, ఊటి, జవ్వాది మలై.. పోరూరు ప్రాంతాలను నుంచి వారిని అధిక కూలీ రేట్లకు తీసుకు రావడం మొదలుపెట్టారు. పలుమార్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మగ్లింగ్ అరికట్టడానికి తమిళనాడులోని రాయవేలూరు, తదితర ప్రాంతాలలో అవగాహనా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. అయినా స్మగ్లింగ్ కార్యక్రమాలను అరికట్టలేకపోయారు. దీంతో స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు భారీ ఎన్ కౌంటర్లు కూడా చేయాల్సిన అనివార్య పరిస్థితులకు పోలీసులు దిగారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios