‘‘ రాజకీయమంటే బురద.. టెక్నాలజీని పప్పులో ఉప్పులా వాడాలి ’’

CBI Ex JD Lakshmi Narayana gives clarity on his political entry
Highlights

తన రాజకీయరంగ ప్రవేశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి స్పందించారు. రాజమండ్రిలో ‘ ఆధ్యాత్మిక కోణంలో సామాజిక, రాజకీయ రంగాలు.. యువత ప్రాధాన్యం’పై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు

తన రాజకీయరంగ ప్రవేశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి స్పందించారు. రాజమండ్రిలో ‘ ఆధ్యాత్మిక కోణంలో సామాజిక, రాజకీయ రంగాలు.. యువత ప్రాధాన్యం’పై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాజకీయం అంటే బురద అని.. దానిని తొలగించడానికి అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు.. సమాజం పట్ల యువత బాధ్యత కలిగి ఉండాలని.. పిల్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిపై ఉందన్నారు..

యువత రాజకీయాల్లో చేరాలని జేడీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం వక్తిత్వ ఆరాధన కంటే వ్యక్తి ఆరాధనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాను రెండు ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దానని.. పంచాయతీ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా ఎల్లప్పుడూ ఉపయోగకరమని.. టెక్నాలజీని పప్పులో ఉప్పులా వినియోగించుకోవాలని.. దీని వల్ల సాధ్యం కానిది ఏది ఉండదని లక్ష్మీనారాయణ అన్నారు.
 

loader