Asianet News TeluguAsianet News Telugu

జగన్ బెయిల్ పిటిషన్‌‌పై సీబీఐ కౌంటర్ ఇదీ: ఆగష్టు 25కి విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ బెయిల్ పిటిషన్ రద్దు పిటిషన్ పై విచారణ ఆగష్టు 25కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఈ విషయమై ఇవాళ కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణకే నిర్ణయం వదిలేశామని ప్రకటించింది. 
 

CBI Court adjourns Ys Jagan Bail petition on August 25 lns
Author
Guntur, First Published Jul 30, 2021, 11:59 AM IST


హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు  ఈ ఏడాది ఆగష్టు 25వ తేదీకి వాయిదా వేసింది.  ఈ కేసుకు సంబంధించి శుక్రవారంనాడు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణకే నిర్ణయం వదిలేశామని దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టును సీబీఐ కోరింది. 

also read:జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ 30కి వాయిదా..

కాగా ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. గతంలో జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజైండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారం వదిలేస్తున్నామని బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజైండర్‌లో పేర్కొన్నారు.  అదే విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఇవాళ సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు. ఈ కేసుపై విచారణను ఆగష్టు 25 వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.

Follow Us:
Download App:
  • android
  • ios