Asianet News TeluguAsianet News Telugu

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ 30కి వాయిదా..

సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనారోగ్య కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోయామని తెలిపారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

CBI court adjourns hearing on CM Jagan's bail cancel petition to July 30 - bsb
Author
Hyderabad, First Published Jul 26, 2021, 12:16 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు.

సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనారోగ్య కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోయామని తెలిపారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 

కాగా, సొంత పార్టీపైనే తిరుగుబాటుకు దిగిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రిపై జగన్, ఎంపి విజయసాయి రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. తనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి  ఫిర్యాదు చేస్తూ వైసీపీ ఎంపీలు రాసిన లేఖపై రఘురామ స్పందించారు. ఈ సందర్భంగానే ఏ1, ఏ2లు తాను అక్రమాలను పాల్పడ్డానని అనడం విడ్డూరంగా వుందన్నారు. 

''ఏ1, ఏ2లుగా పేరుపొందిన వారి గురించి చర్చించుకుందా. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల నేరచరితకు సాక్ష్యంగా 17 కేసులున్నాయి. వీరిపై చార్జీషీట్లు కూడా నమోదయ్యాయి. ఇలాంటివారు నేను బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టానని లేఖరాయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది'' అని విజయసాయి ఎద్దేవా చేశారు. 

''నా కంపెనీ బ్యాంకుకు సొమ్ములు ఎగ్గొట్టాయని... త్వరగా చర్యలు తీసుకోవాలని ఏ1, ఏ2 లు ప్రధాని, రాష్ట్రపతికి లేఖ రాశారు. రూ.43 వేల కోట్లు దోచారని అభియోగాలు ఎదుర్కొంటూ చార్జిషీట్లు కూడా దాఖలయిన నిందితులు నేను అక్రమాలకు పాల్పడ్డానని అనడం విడ్డూరంగా వుంది'' అని రఘురామ మండిపడ్డారు. 

గతంలో సిబిఐ జేడి లక్ష్మీనారాయణ దర్యాప్తులో జగన్ కు సంబంధించిన అక్రమాల గురించి చాలా తక్కువ బయటపడిందన్నారు. మిగతా అక్రమాలకు సంబంధించిన వివరాలను తాను ఇప్పటికే కోర్టుకు అందించినట్లు తెలిపారు. జగన్ లూటీ గురించి ప్రధాని, రాష్ట్రపతికి వివరిస్తానని రఘురామ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios