రాజా, కనిమొళి నిర్దోషులే

రాజా, కనిమొళి నిర్దోషులే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జి స్పెక్ట్రమ్ కేసులో నిందుతలను నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. పాటియాల హౌస్ కోర్టు గురువారం ఉదయం ఇచ్చిన తీర్పుతో డిఎంకె పార్టీలో సంబరాలు ఆకాశాన్నంటాయి. 2 స్పక్ట్రమ్ లో దాదాపు 2 లక్షల కోట్ల మేర కుంభకోణం జరిగిందని యుపిఏ హయాంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి అందరకీ తెలిసిందే. పాటియాల్ కోర్టు తన తీర్పులో ప్రధాన నిందుతులుగా సిబిఐ పేర్కొన్న కనిమొళి, రాజాలపై కేసులను కొట్టేసింది. ఈ కేసుపై దాదాపు ఏడేళ్ళుగా కోర్టులో విచారణ సాగింది. సరిగ్గా ఆర్కె నగర్ ఉపఎన్నిక జరుగుతున్న రోజే ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె నేతలిద్దరూ నిర్దోషులుగా విడుదలవ్వటం గమనార్హం. కుంభకోణం వెలుగు చూసినపుడు రాజానే టెలికం మంత్రిగా ఉన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos