హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులలో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసు నుంచి తన పేరు తొలగించాలన్న జగన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.  

హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులలో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసు నుంచి తన పేరు తొలగించాలన్న జగన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జగన్‌ డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో డిశ్ఛార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని జగన్‌, విజయసాయిరెడ్డి, శామ్యూల్‌ కోర్టుకు వివరించారు. పెన్నా కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. దీంతో పెన్నా, రఘురామ్‌, ఇండియా సిమెంట్స్‌ ఛార్జ్‌ షీట్ల విచారణ ఈనెల 13కి వాయిదా పడింది. ఈడీ కేసులు ఏ దశలో విచారణ జరపాలన్న అంశంపై హైకోర్టు తీర్పు రావాల్సి ఉందన్న విజయసాయిరెడ్డి అభ్యర్థనతో ఈడీ కేసుల విచారణ ఈనెల 20కి వాయిదా పడింది.