నోటుకు ఓటు కేసు: మంత్రులతో బాబు లంచ్ బ్రేక్ భేటీ, ఏం చేద్దాం?

Cash for vote: Chandrababu's lunch break meeting
Highlights

ఓటుకు నోటు కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మళ్లీ తెర మీదికి తెచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు.

బెంగళూరు: ఓటుకు నోటు కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మళ్లీ తెర మీదికి తెచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. లంచ్ బ్రేక్ లో ఆయన మంత్రులతో సమావేశమయ్యారు. 

ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు మళ్లీ తెర మీదికి రావడంతో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల కేటాయింపులు జరిపిన వైనంపై కేసిఆర్ సమీక్ష నిర్వహించారు. 

ఆ వ్యవహారాలు ముందుకు వస్తే రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలనే విషయంపై చంద్రబాబు  చర్చించినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఆ కేసుతో చంద్రబాబు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 

చంద్రబాబుపై ఏ విధమైన కేసు లేదని, గతంలో హైకోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసుపై కేసిఆర్ సమీక్ష చేసినంత మాత్రాన ఏమీ కాదని ఆయన అన్నారు. ఈ కేసు విషయంలో తమకు ఏ విధమైన భయం లేదని అన్నారు. మత్తయ్య పిటిషన్ దానిపై స్పష్టత ఇచ్చిందని చెప్పారు. 

loader