కాంట్రాక్టర్ పై టీడీపీ నేత వర్ల రామయ్య కుమారుడి వీరంగం.. కేసు నమోదు...

ఓ వైపు తండ్రి రేషన్ బియ్యం మీద ఫైట్ చేస్తుంటే.. మరో వైపు కొడుకు శిలాఫలకాలు కట్టకుండా అడ్డుకుంటూ వీరంగం సృష్టించాడు. టీడీపీ నేత వర్ల రామయ్య తనయుడు కుమార్ రాజా మీద కేసు నమోదయ్యింది. 

case registered against tdp leader varla ramaiah son kumar raja in vijayawada

గాంధీనగర్ : TDP నేత వర్ల రామయ్య తనయుడు, కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ Varla Kumar Raja (రాజా) పై కేసు నమోదయ్యింది. డివిజన్ అభివృద్ధి పనుల కోసం నిర్మించిన శిలాఫలకం దిమ్మె కూల్చివేయడం.. పనులు చేస్తున్నContractor ను చంపేస్తానని బెదిరించిన ఘటనపై Vijayawadaలోని భవానిపురం పోలీసులు కుమార్ రాజాపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ విద్యాధరపురం 44వ డివిజన్ చిన్న సాయిబాబా గుడి ఎదురుగా అంబేద్కర్ నగర్ లో drinking water pipeline నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. ఈ  మేరకు నిర్మాణ పనులకు శంకుస్థాపన కోసం అంబేద్కర్ నగర్ ఆర్చి వద్ద  శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్ శేఖర్ నిర్మాణ పనులు ప్రారంభించారు.

ఇంతలో  వర్ల కుమార్ రాజా అక్కడకు వచ్చి శిలాఫలకం నిర్మాణం చేయొద్దంటూ అడ్డుకున్నారు. ఆర్చికి అడ్డు వస్తుందంటూ వాగ్వాదానికి దిగి.. చంపేస్తానంటూ కాంట్రాక్టర్ ను బెదిరించారు. అంతటితో ఆగకుండా దిమ్మెను కూల్చివేశారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ శేఖర్ ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ ఏఈ ఇస్సార్ అహ్మద్ భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనలో కుమార్ రాజాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ అభివృద్ధి పనులు చేపడుతుంటే జీర్ణించుకోలేక ఇలా చేయడంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. పేదలకు తాగునీరు అందడం వర్ల రామయ్య, ఆయన తనయుడికి ఇష్టం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా, నిరుపేద ప్రజల ఆకలిబాధను తీర్చేందకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం విషయంలోనూ వైసిపి నాయకులు అక్రమాలకు పాల్పడతున్నారని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. ఏపీలో రేషన్ బియ్యం  మాఫియా పురుడుపోసుకుందని... వైసిపి నాయకులు అధికార అండతో పిడిఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. 

ఇలా పీడీఎస్బియ్యాన్ని తరలిస్తున్న మాఫియాపై సమగ్ర విచారణ జరిపించాలంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తో పాటు ఏసీబీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేసారు. ''ఆర్ధికంగా వెనకబడిన వర్గాల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోవడం దుర్మార్గం. ఏపీలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా కోసమే కొన్ని మాఫియాలు ఏర్పడ్డారు. కాకినాడ పోర్టు ద్వారా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది'' అని వర్ల ఆరోపించారు.

''రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదవారికి అందాల్సిన బియ్యం అందక పస్తులు గడుపుతున్నారు. 2020-21 లో రూ.7,972 కోట్ల విలువ గల 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించారు. 2021-22లో ఇప్పటికే రూ7,710 కోట్ల విలువ గల 30.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా ఎగుమతి చేశారు. కోవిడ్ ఉన్నా ఇంత పెద్ద మొత్తంలో బియ్యం ఎగుమతులు చేశారంటే దీని వెనుక మాఫియా ఉందని అర్థమవుతుంది''  అని పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios