అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన మరో టీడీపీ నేతపై  పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాపై  మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఛైర్మెన్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రను బెదిరించారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 506, 448, 170/2021, సెక్టన్ల కింద కేసు ఆలపాటి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

also read:అమూల్ కోసమే దూళిపాళ్ళ టార్గెట్...బందిపోటు, గూండాలా అరెస్ట్: దేవినేని ఉమ

శుక్రవారంనాడు ఉదయం  ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే , సంగం డెయిరీ ఛైర్మెన్ దూళిపాల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. టీడీపీకి చెందిన పలువురు కీలకనేతలపై ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కేసులు నమోదౌతున్నాయి.  తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తోందని చంద్రబాబు పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఏసీబీ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టయ్యాడు. టీడీపీ నేత కూన రవికుమార్ పై పలు కేసులు నమోదయ్యాయి.