గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాంపై ఫిర్యాదుల పర్వం  కొనసాగుతోంది. ఇప్పటి వరకు వివిధ వర్గాల వారు కోడెల శివరాంపై ఫిర్యాదు చేస్తే శనివారం మాత్రం సొంత పార్టీ నేతే ఫిర్యాదు చేయడం గమనార్హం.  

ఓ కాంట్రాక్టు విషయంలో కోడెల శివరామ్‌ తనను మోసం చేశారంటూ టీడీపీ నేత శివరామయ్య పోలీసులను ఆశ్రయించారు. రూ.7లక్షలు ఇస్తేనే పనిచేయనిస్తానని తనను బెదిరించారని ఆరోపించారు. రూ.7లక్షలు తీసుకుని కాంట్రాక్టును రద్దు చేయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కోడెల శివరామ్ తోపాటు ఏడు లక్షల రూపాయలు ఇస్తేనే పని చేయనిస్తానని తనను బెదిరించారని, ఆ తర్వాత డబ్బు తీసుకుని కూడా కాంట్రాక్టును రద్దు చేయించారని ఆరోపించారు. ఈ మేరకు శివరామ్‌తో పాటుగా ఆయన అనుచరులపై కూడా నరసారావుపేట వన్‌టౌన్‌ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.

ఇకపోతే ఇప్పటి వరకు కోడెల శివరాంపై 12 కేసులు నమోదయ్యాయి. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా పనిచేస్తున్న సమయంలో కే ట్యాక్స్‌ పేరుతో నియోజకవర్గంలో కోడెల శివరాం కుమార్తె కోడెల విజయలక్ష్మీలు వసూళ్లకు పాల్పడ్డారంటూ ప్రచారం జరుగుతోంది.