విశాఖపట్టణం: ఏపీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్  సోదరుడి కొడుకుపై విశాఖపట్టణం త్రీటౌన్ పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది.

నాలుగు రోజుల క్రితం బీచ్ రోడ్డులో జరిగిన ఘటనపై  ఓ కానిస్టేబుల్  ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి రాజీ చేశారు. ఈ విషయం విశాఖపట్టణం సీపీ దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు.

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోదరుడి కొడుకు రాంభరత్,  డీఎస్పీ దాసరి రవిబాబు సోదరుడి కొడుకుపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కేసు నమోదు చేయకుండా రాజీ చేసిన పోలీసు అధికారి రామారావును సీపీ వీఆర్ కు పంపారు.ఈ ఘటనపై విచారణ జరపాలని కొత్త సీఐ ఈశ్వరరావును విచారణ జరపాలని ఆదేశించారు..