ఆంధ్రప్రదేశ లో అధికార టీడీపీ నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నపుడు అవినీతికి పాల్పడటం తర్వాత కేసుల్లో ఇరుక్కోవటం మామూలైపోయింది. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్సీపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారిపై 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో రూ.26.3 లక్షల స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో పదిమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులపై కోటనందూరు పోలీసులు సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.