అనంతపురంలోని బుక్కరాయసముద్రం కొండపై నుంచి కారు పడిపోయి, ఒకరు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అది ఆత్మహత్యా? ప్రమాదమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనంతపురం : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉమాపతి అనంతపురంలోని శ్రీ విద్యానికేతన్ అనే ఓ స్కూలు కరస్పాండెంట్ గా అతడిని గుర్తించారు. దేవరకొండ మీద ఉన్న గుడికి వెళ్లి వస్తుండగా ఘాట్ రోడ్ లో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. అయితే, అది ఆత్మహత్యా? కారు ప్రమాదమా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వెలుగు చూడడంతో ఈ ప్రమాదం గురించి తెలుస్తోంది. 

కాగా ఉమాపతికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పోలీసుల విచారణలో తెలుస్తోంది. కారణం ఏంటంటే...కారు డ్రైవర్ ఉండగా, అతనే స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్లడం.. వీడియోలో సార్, సార్ అని వెనకనుంచి పిలుస్తుండడం వినిపిస్తుంది. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. వీడియోకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

వారందరితో వైఎస్ వివేకాకు అక్రమ సంబంధాలు.. బెయిల్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి సంచలనం..