కృష్ణాజిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కీసర ఇన్వెంటా కెమికల్ సమీపంలో కారు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. 

వీరిని వెంటనే నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న ఇరువురిని విజయవాడకు తరలించారు.

ఈ కారు విజయవాడ నుండి హైదరాబాదు వెళ్తుంది. అయితే నిద్రమత్తు కారణంగా కల్వర్టును ఢీకొట్టినట్లు సమాచారం.