Asianet News TeluguAsianet News Telugu

కరోనా ప్రభావం తగ్గాక విశాఖకు రాజధాని తరలింపు: మంత్రి పెద్దిరెడ్డి

 కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విశాఖకు రాజధాని తరలించే పనులు జరుగుతాయని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

capital city shifting work will be started after corona:minister peddi ramachandra Reddy
Author
Amaravathi, First Published Jul 31, 2020, 5:13 PM IST

చిత్తూరు: కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విశాఖకు రాజధాని తరలించే పనులు జరుగుతాయని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.

also read:జగన్ కు జోష్, చంద్రబాబుకు షాక్: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మంత్రి మాట్లాడారు. చంద్రబాబుతో పాటు ఆయన మిత్రులు సీఆర్ డీఏను అడ్డు పెట్టుకొని రియల్ ఏస్టేట్ వ్యాపారం చేశారని ఆయన ఆరోపించారు. దీంతో వేలాది కోట్లు లబ్దిపొందేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు.

also read:పంతం నెగ్గించుకొన్న జగన్: మూడు రాజధానులపై బాబు ఏం చేస్తారు

రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో చంద్రబాబుకు తీవ్రమైన బాధ కలుగుతోందని ఆయన సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మూడు రాజధానులను టీడీపీ సహా అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ కూడ అమరావతికే మద్దతు పలికింది.మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధానుల ఏర్పాటు ఇక లాంఛనమే కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios