Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు జోష్, చంద్రబాబుకు షాక్: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం నాడు  ఆమోదం తెలిపారు.

andhra pradesh governor approves crda, ap decentralisation bill
Author
Amaravathi, First Published Jul 31, 2020, 3:52 PM IST

అమరావతి: సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం నాడు  ఆమోదం తెలిపారు.

మూడు వారాల క్రితం ఈ రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

అధికారంలోకి వచ్చి తర్వాత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ  విషయాన్ని అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ ప్రకటించారు.
ఈ రెండు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఏడాది జూన్ మాసంలో శాసనమండలి వాయిదా పడింది. జూన్ కంటే ముందు జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని సూచించింది.

అయితే సెలెక్ట్ కమిటి ఏర్పాటు కాలేదు. సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ  టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేశారు. 

మూడు రాజధానుల ప్రతిపాదనను  టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఈ రెండు బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే అదే సమయంలో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని కోరిన విషయం తెలిసిందే.

జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన మరోసారి ఈ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. శాసనమండలికి పంపారు. ఈ బిల్లులపై ఎలాంటి చర్చ జరగకుండానే మండలి వాయిదా పడింది. 

శాసనమండలి వాయిదా పడిన నెల రోజుల తర్వాత ఈ బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులను ఆమోదించకుండా ఉండాలని విపక్షం లేఖలు రాసింది. యనమల రామకృష్ణుడు, చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశాడు.ఈ రెండు బిల్లుల విషయంలో న్యాయ సలహా తీసుకొన్న తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios