Asianet News TeluguAsianet News Telugu

ఈ మంత్రులపై వేటు వేయగలరా ?

  • దశాబ్దాల తరబడి విద్యార్ధులను వేధింపులకు గురిచేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్ధల్లో నాలుగు రోజుల్లో మార్పులు రావాలట.
  • వస్తాయా? పైగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ళల్లో యాజమాన్యాల వైఖరి మరింత దారుణంగా తయారైందన్నది వాస్తవం.
  • రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్ధలు చాలానే ఉన్నప్పటికీ వివాదాలు మొత్తం కేవలం నారాయణ, చైతన్య విద్యాసంస్ధల చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి?
  • ఎందుకంటే, అవిరెండు మరీ బరితెగించేసాయి కాబట్టి. అందులోనూ రెండు విద్యాసంస్ధల యాజమాన్యాలు చంద్రబాబుకు మరీ దగ్గర కాబట్టి.
Can naidu axe his own ministers for suicides in corporate colleges

‘విద్యార్ధుల వేధింపుల విషయంలో కార్పొరేట్ విద్యాసంస్ధల పద్దతుల్లో నాలుగు రోజుల్లో మార్పు రావాలి’..ఇది తాజాగా చంద్రబాబునాయుడు అల్టిమేటమ్. అంతేకాదు ‘కార్పొరేట్ విద్యాసంస్ధల్లో మార్పు రావాలట, ఆమార్పును ప్రజలు గ్రహించి సంతృప్తి చెందాలి’ అని కూడా తీవ్రంగా హెచ్చరించారు. విచిత్రంగా లేదు చంద్రబాబు హెచ్చరికలు. దశాబ్దాల తరబడి విద్యార్ధులను వేధింపులకు గురిచేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్ధల్లో నాలుగు రోజుల్లో మార్పులు రావాలట. వస్తాయా? పైగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ళల్లో యాజమాన్యాల వైఖరి మరింత దారుణంగా తయారైందన్నది వాస్తవం.

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్ధలు చాలానే ఉన్నప్పటికీ వివాదాలు మొత్తం కేవలం నారాయణ, చైతన్య విద్యాసంస్ధల చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? ఎందుకంటే, అవిరెండు మరీ బరితెగించేసాయి కాబట్టి. అందులోనూ రెండు విద్యాసంస్ధల యాజమాన్యాలు చంద్రబాబుకు మరీ దగ్గర కాబట్టి. ఎలా దగ్గరంటే, నారాయణ, చైతన్య విద్యాసంస్ధల యాజమాన్యాలైన మంత్రి నారాయణ, మాజీ ఎంఎల్సీ చైతన్యరాజు ఇద్దరూ టిడిపి నేతలే కాబట్టి. అందుకే చట్ట విరుద్ధంగా వారి విద్యాసంస్ధల్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవటం లేదు.

గడచిన మూడున్నరేళ్ళల్లో సుమారు 40 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి  కనీసం చీమకుట్టినట్లైనా లేదు. విద్యార్ధుల ఆత్మహత్యలు జరిగినపుడల్లా మీడియా ఎంతగా గోల చేసినా చంద్రబాబు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే, విద్యాసంస్ధల యాజమాన్యాలతో ఉన్న సంబంధాలే. పైగా ఇది చాలదన్నట్లుగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు- నారాయణ స్వయానా వియ్యంకులు. ఇక, చెప్పేదేముంది. ఎవరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు?

అందుకనే విద్యార్ధి సంఘాలు, ప్రతిపక్షాలు మంత్రులు, వియ్యంకులైన నారాయణ, గంటాలను మంత్రివర్గం నుండి తప్పించమని గోలపెడుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్ధల్లో విద్యార్ధుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అనే స్ధాయిలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబులో చలనం లేదు. అదే విషయమై వైసీపీ అధినేత వైఎస జగన్మోహన్ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో నిలదీసారు.

అన్నీ వైపుల నుండి ప్రభుత్వంపై ఒత్తిళ్ళు పెరిగిపోతున్న కారణంగానే తప్పనిసరి పరిస్ధితుల్లో మాత్రమే చంద్రబాబు సమావేశం పెట్టినట్లుంది. విద్యార్ధులపై నిజంగానే ఒత్తిళ్ళు లేకుండా చేయాలంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు మంత్రులిద్దరినీ మంత్రివర్గం నుండి తప్పించగలరా? ఎందుకంటే, వారిద్దరినీ మంత్రివర్గం నుండి తప్పిస్తే కానీ విద్యా వ్యవస్ధ బాగుపడదన్న ఆరోపణలు వినబడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios