దారుణం : కరోనా మృతదేహాన్ని స్మశానంలోకి రానివ్వని గ్రామస్తులు.. చివరికి.. (వీడియో)
గుంటూరుజిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన మహిళ మృతదేహాన్ని స్మశానంలోకి తీసుకురావద్దంటూ గ్రామస్తులు అడ్డుకోవడంతో.. గేటు దగ్గరే భార్య మృతదేహాన్ని పెట్టుకుని భర్త కన్నీటి పర్యంతమైన విషాద ఘటన సత్తెనపల్లి మండలంలో చోటు చేసుకుంది.

"
సత్తెనపల్లి మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన రెంటపాళ్ల జయప్రద (52) నాలుగు రోజులుగా అనారోగ్యం పాలైంది. కోవిడ్ అన్న అనుమానంతో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. శనివారం ఉదయం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు ఆటోలో తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో జయప్రద మృతి చెందింది.
దీనితో భర్త ప్రసాదరావు నందిగామ ఎస్సి కాలనీలోని స్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకువెళ్లాడు. కోవిడ్ కారణంగా చూపి స్మశాన వాటికలో ఖననం చేసేందుకు స్ధానికులు అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు. తీవ్ర ఆవేదనతో భార్య శవంతో భర్త స్మశాన వాటిక ముందు బోరున విలపిస్తూ వావిలాల ప్రజ్వలన సంస్ధ సాయం కోరడంతో.. వారు వచ్చి మృతదేహానికి సత్తెనపల్లి హిందూ మహా ప్రస్ధానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.