టీడీపీ నేత బూరగడ్డ వేద వ్యాస్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఊహించని షాక్ ఇచ్చారు.  మున్సిపల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ( ముడా) ఛైర్మన్ పదవి నుంచి బూరగడ్డ వేద వ్యాస్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో బూరగడ్డ వేద వ్యాస్ కి ఈ నామినేటెడ్ పదవి దక్కింది.  కాగా... ప్రభుత్వం మారాక ఆ పదవికి రాజీనామా చేయాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన పదవిని వీడలేదు. దీంతో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రభుత్వం మారిన తర్వాత నామినేటెడ్ పదవులు దక్కిన చాలా మంది తమ పదవులకు రాజీనామా చేశారు. కొందరేమో పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేశారు. కానీ బూరగడ్డ వేద వ్యాస్ మాత్రం నోటీసులు జారీ చేసినా కూడా పదవిని వీడలేదు. పైగా వారానికి రెండుమూడు రోజులు ముడా కార్యాలయానికి వచ్చి తమ తాబేదార్లకు పనుల కోసం అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చేవారు. వేదవ్యాస్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇంకా నామినేటెడ్‌ పదవులు పట్టుకుని ఇంకా వేలాడుతున్న వారిలో గుబులు మొదలైంది.