మోడీ బూట్లు నాకే స్థితికి విజయసాయిరెడ్డి: బుద్ధా వెంకన్న

Budha Venkanna retaliates Vijaya Sai Reddy
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. విజయసాయిరెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆయన అన్నారు. 

ప్రధాని మోడీ బూట్లునాకే స్థితికి విజయసాయిరెడ్డి దిగజారాడని ఆయన గురువారం మీడియా సమావేశంలో విమర్శించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి విజయసాయిరెడ్డికి లేదని అన్నారు. తప్పుడు లెక్కలు రాసి రాజశేఖర్‌రెడ్డి‌కి, జగన్‌కు సహకరించిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు. 

ఏపీ ఆత్మగౌరవం కోసం తాము ధర్మపోరాట దీక్ష చేస్తుంటే వైసీపీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ డ్రామా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. ఏపీ ప్రతిష్టతను జగన్, విజయసాయిరెడ్డి దెబ్బతీస్తున్నారని అన్నారు. బీజేపీ డైరెక్షన్లో నడుస్తోన్న వైసీపీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. 

కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్ట్ గురించి మాట్లాడకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడంలో అర్థం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌ భయపడుతున్నారని అన్నారు. 
తమిళనాడు ప్రభుత్వాన్ని మోదీ నడిపిస్తున్నారని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని, అవిశ్వాసం నెగ్గాలని ప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

loader