Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నాని.. నీకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. జగన్ హయాంలోనే మూల్యం చెల్లిస్తాడు: బుద్దా వెంకన్న వార్నింగ్

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని, టీడీపీ నేతలపై దాడులను పార్టీ నేత బుద్దా వెంకన్న ఖండించారు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లక్ష్యం చేసుకునే కొందరు మాటల యుద్ధానికి తెగబడుతున్నారని, వారిని ఇబ్బంది పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో కాదు..  జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ఎందుకంటే తమకూ ఓర్పు.. సహనం నశించిందని వివరించారు. ఇక నుంచి తమ పార్టీ కార్యకర్తలు విశ్వరూపం చూపిస్తారని హెచ్చరించారు. 
 

buddha venkanna warns kodali nani over attack on tdp leaders
Author
Amaravathi, First Published Jan 21, 2022, 5:17 PM IST

అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని టీడీపీ(TDP) నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna).. జగన్(CM Jagan) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. క్యాసినో(Casino) బాగోతాన్ని ప్రజలకు వివరించడానికి వెళ్లిన పార్టీ సీనియర్ నేత బోండా ఉమా కారును ధ్వంసం చేయడాన్ని, టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగు దేశం పార్టీని ఇబ్బంది పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొడాలి నాని వంటి వ్యక్తులతో చంద్రబాబును తిట్టిస్తున్నారని అన్నారు. గన్‌మెన్లను అడ్డుం పెట్టుకుని అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. సాక్షాత్తు సీఎం జగన్‌ కూడా గన్ మెన్‌లను పెంచి మరీ వారి బూతులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. వీరు కేవలం చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారని ఆరోపణలు చేశారు కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు.

చంద్రబాబును తిట్టి ఇప్పుడు పోటుగాడిలాగా కొడాలి నాని ఫీల్ అవుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు అధికారంలో లేనప్పుడు నాని అసలు ఎక్కడున్నాడని అడిగారు. ఎలా ఉన్నాడని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌తో కలిసి పని చేసినట్టు ఆయన ఫోజులు కొడుతూ ఉంటాడని, అది నిరూపించడానికి ఒక్క ఫొటో అయినా చూపించగలడా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు భిక్ష పెడితే ఎమ్మెల్యే అయ్యాడని విమర్శించారు. ఇప్పుడు జగన్ తానా అంటే తందానా అని నోరు పారేసుకుంటున్నవా? అని ప్రశ్నించారు. 

కొడాలి నాని క్యాసిడో ఆడించింది నిజం కాదా? అంటూ సూటి ప్రశ్న వేశారు. అమాయక ప్రజల నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు వందల కోట్ల రూపాయలను దోచుకున్నాడని ధ్వజమెత్తారు. మీ తప్పులను ప్రశ్నిస్తే.. తమ వాళ్ల కారులను ధ్వంసం చేయిస్తారా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ రౌడీ మూకలు రోడ్లపైకి వస్తే.. పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. వాస్తవాలు వివరించడానికి వెళ్లిన తమ టీడీపీ నేతలను మాత్రమే అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు.  క్యాసినో ఆడినవాిపై కేసులు ఉండవా? అంటూ అడిగారు. కొడాలి నాని.. నీఅకు కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని హెచ్చరించారు. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే ఇక సహించబోమని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు విశ్వరూపం చూపిస్తారని అన్నారు. ఇక తమకు కూడా ఓర్పు, సహనం నశించిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం కాదు.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే కొడాలి నాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

గుడివాడలో Sankranti పర్వదినం సందర్బంగా  ఈ నెల 14 నుండి క్యాసినో నిర్వహించారు.  ఈ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకొన్నారు. గుడివాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో  కోడి పందెలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటు ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారు. రూ. 10 వేలు చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతించారు నిర్వాహకులు. ఈ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా నియమించారు. ఈ ఫంక్షన్ హాల్లో  విచ్చలవిడిగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటు చట్ట విరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని  టీడీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఈ నెల 17న ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 500 కోట్లు చేతులు మారాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై  పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. Casino నిర్వహించిన ఫంక్షన్ హాల్ రాష్ట్ర మంత్రికి చెందిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios