టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు రెండోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందు గత నెలలో వెంకన్న మొదటి సారి కోవిడ్ బారినపడ్డారు.

ఆ సమయంలో ఆయన 14 రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని బుద్ధా ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఓ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇటీవలే వైరస్ నుంచి కోలుకున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పరిస్ధితి చేయి దాటిపోయిందని.. ప్రజలు కరోనా బారి నుంచి తప్పించుకునే పరిస్ధితి కనిపించడం లేదన్నారు.

తక్షణం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కళ్యాణ మండపాలను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.