విజయవాడ: వైఎస్ జగన్ ఏడాది పాలన కేవలం ట్రైలర్ మాత్రమే అన్న ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ స్పందించారు. ట్రైలరే ఇలా వుంటే ఇకముందు పాలన ఎలా వుండనుందో అంటూ ఎద్దేశా చేశారు. వైసిపి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ పాలను నచ్చడం లేదంటూ... అందువల్లే బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని బుద్దా అన్నారు.  

''జగన్ గారి ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్నారు మామ విజయసాయి రెడ్డి. నిజమే ట్రైలర్ కే ఎంపీలు జంప్, మంత్రుల అసంతృప్తి, ఎమ్మెల్యేలు ధర్నాలు, నిరసనలు. ఇక అసలు బొమ్మ పడితే యుశ్రారైకాపా ఖాళీ. మామా, అల్లుడికి చంచల్ గూడా జైలులో చిప్పకూడు ఖాయం'' అంటూ ట్విట్టర్ వేదికన బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. 

''వామ్మో ఈ దోపిడీ ఏంటి జగన్ గారు? బాబు గారు తన సొంత ఖర్చులతో హిమాలయా వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే గోల గోల చేసారు.. ఇప్పుడు ప్రజాధనంతో మీరు చేస్తున్న దుబారాకి ఎం సమాధానం చెబుతారు?'' అని ప్రశ్నించారు. 

read more   తండ్రి వైఎస్సార్ బాటలోనే జగన్...: యనమల రామకృష్ణుడు
 
''విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న జగన్ రెడ్డి వాటర్ బోటిల్, మజ్జిక ప్యాకెట్ ల కోసం 43.44 లక్షలు స్వాహా. జగన్ గారి ప్రమాణ స్వీకారానికి, ఇప్పటికీ డబ్బులు విడుదల చేస్తూనే ఉన్నారు. వాటర్ బాటిల్స్, స్నాక్స్ కోసం,59.49 లక్షలు స్వాహా'' అని ఆరోపించారు.   
 
''వైఎస్ జగన్ తో పాటు ఆయన క్రిమినల్ పరివార్ మోకాల్లో ఉన్న వైరస్ పట్టిన చిప్ లనే వాడుతున్నారు. బాత్ రూంలో బాబాయ్ గుండె పోటుతో పోయారని కలరింగ్ ఇచ్చారు. విషయం బయటపడేసరికి సీబీఐ అని అరిచారు'' 

''అధికారం వచ్చి 13 నెలలు అవుతున్నా బాబాయ్ ఆత్మ శాంతించలేదు. రక్తం తుడిచేసినా, గుండెపోటు అని తలపట్టుకున్నా నేరస్తులని బాబాయ్ వదిలిపెట్టడు. ఇది వాస్తవం అధ్యక్షా!!'' అంటూ వివిధ విషయాలపై జగన్ ను, విజయసాయి రెడ్డి ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు బుద్దా వెంకన్న.