Asianet News TeluguAsianet News Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ : విజయసాయి రెడ్డికి అధికార మదం నెత్తికెక్కింది.. బుద్ధా వెంకన్న(వీడియో)

మీరు పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగుల కంటే విశాఖ ఉక్కు నష్టాలు తక్కువే అంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీని దుయ్యబట్టారు. 28 మంది ఎంపీలు ఉండి మీరు ఏం పీకుతున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించే స్థాయి మీకు లేదా అని ప్రశ్నించారు. పోస్కో ప్రతినిధులను ముఖ్యమంత్రి తాడేపల్లిలో కలవడం నిజం కాదా అని ప్రశ్నించారు.

budda venkanna fires on vijaysai reddy and ys jagan over visakha steel plant issue - bsb
Author
hyderabad, First Published Feb 9, 2021, 12:43 PM IST

మీరు పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగుల కంటే విశాఖ ఉక్కు నష్టాలు తక్కువే అంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీని దుయ్యబట్టారు. 28 మంది ఎంపీలు ఉండి మీరు ఏం పీకుతున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించే స్థాయి మీకు లేదా అని ప్రశ్నించారు. పోస్కో ప్రతినిధులను ముఖ్యమంత్రి తాడేపల్లిలో కలవడం నిజం కాదా అని ప్రశ్నించారు.

"

దీంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాత్ర ఉంది కాబట్టే కేంద్రాన్ని ప్రశ్నించలేక లేకపోతున్నారంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అందరి నెత్తిన చెయ్యి పెట్టాడన్నారు. 

అంతగా చదువు లేకపోయినా ముఖ్యమంత్రిగా అంజయ్య సుపరిపాలన చేశారు.  కానీ ఇప్పటి ముఖ్యమంత్రికి దోచుకుతినడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ వై జాలి చూపించారు. 

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా నిమిత్త మాతృడేనని పార్టీలో అంతర్గతంగా జరిగే విషయాలపై ఆయనకు కూడా అవగాహన లేదని వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డికి అధికార మదం బాగా నెత్తికెక్కిందని,  అందుకే ఆయనకు ప్రజలన్నా, చివరికి ఉపరాష్ట్రపతి అన్నా లెక్కలేదని విరుచుకుపడ్డారు.

అనంతరం  విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు మాట్లాడుతూ  అధికార పక్షంలో ఉన్న వాళ్ళు రాజీనామా  చేస్తేనే కేంద్రంపై ఒత్తిడి వస్తుందని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలం అని అన్నారు. అవసరమైతే స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios