టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేధికగా ఒకరిపై మరొకరు విమర్శలు కురిపించుకున్నారు. విజయసాయి తాను చెప్పాలని అనుకున్న ప్రతి విషయాన్నీ... గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ట్విట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారు. ఆ ట్వీట్ లకు  టీడీపీ నేతలు కూడా గట్టిగా సమాధానం ఇస్తూ ఉంటారు. తాజాగా... విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 

ముఖ్యమంత్రి జగన్ ని పెద్ద దొంగ అని.. విజయసాయిని పంది కొక్కు అంటూ పోలుస్తూ విమర్శలు చేశారు. గతంలో వారిద్దరూ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష విధించిన విషయాన్ని కూడా బుద్ధా ప్రస్తావనకు తీసుకువచ్చారు. 

 16 నెలలు జైల్లో గడిపిన పెద్ద దొంగ..పందికొక్కు అవినీతి గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని లూటీ చేసిన ఆ పందికొక్కు.. తనని ఎవరూ మళ్ళీ బోనులో పెట్టకుండా కాళ్ళు పట్టుకుంటూ ఉంటుందని.. ఇంతకీ ఆ పందికొక్కు ఎవరు..420 తాతయ్యా గారు? అంటూ బుద్ధా ట్వీట్ చేశారు. మరి దీనిని విజయసాయి ఎలా స్పందిస్తారో చూడాలి.