విశాఖ ప్రాంతానికి చెందిన ఓ బీఎస్ఎఫ్ జవాను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంకర ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్ గా సుధాకర్ నాయుడు విధులు నిర్వహిస్తున్నాడు. విశాఖకు చెందిన సుధాకర్ నాయుడు అకస్మాత్తుగా చనిపోయినట్లుగా కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

Also Read న్యాయం కోసం వచ్చిన యువతిపై అఘాయిత్యం.. ఎస్ఐ బాలకృష్ణపై చర్యలు...

సుధాకర్ నాయుడుకి ఇటీవల పెళ్లి కుదిరింది. మరో రెండు నెలల్లో అతనికి పెళ్లి కూడా చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. కాగా ఇంతలోనే అతను చనిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

సుధాకర్ నాయుడు తండ్రి స్టీల్ ప్లాంట్ లో వ్తెర్ రాడ్ మిల్స్ (WRM) లో విధులు నిర్వహిస్తున్నాడు. మృతదేహాన్ని గురువారం సాయంత్రానికి విశాఖకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.