ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చెల్లెలి స్నేహితురాలిని గర్భవతిని చేశాడో యువకుడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది.

ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి తరచుగా వెళ్లి పుస్తకాలు చెప్పుకోవడం, స్నేహితురాలితో కబుర్లు చెబుతూ ఉండేది. ఈ క్రమంలో సదరు బాలికపై కన్నేసిన స్నేహితురాలి సోదరుడు గంజి నరేంద్ర ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాడు.

ఈ విషయం నిందితుడి కుటుంభసభ్యులకు తెలియడంతో.... తమ కుమారుడితో పెళ్లి జరిపిస్తామని, విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను నమ్మించారు. దీనిని అలుసుగా తీసుకున్న నరేంద్ర బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. రోజు రోజుకు తమ కుమార్తెలో వస్తున్న మార్పులను గమనించిన బాలిక తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేంద్రను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే తమ కుమార్తెపై లైంగిక దాడికి ప్రోత్సహించిన నిందితుడి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని బాలిక తల్లిదండ్రులు గుంటూరు పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.