సామాజిక సేవలోనే ఉంటారా లేక మెల్లిగా రాజకీయాల్లోకి కూడా వస్తారా అన్నది ఇప్పటికైతే సస్పెన్సే.
స్వర్గీయ నందమూరి తారకరామారావు మనమరాలు నారా బ్రాహ్మణి రక్తదాన ప్రచారానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్టిఆర్ ట్రస్ట్ వ్యవహారాలు కూడా చూస్తున్న బ్రాహ్మణి రక్తదానం చేయమని యువతను బాగా ప్రోత్సహిస్తున్నారు చాలా కాలంగా. ఎన్టిఆర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ట్రస్ట్ భవన్ తరపున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రజాహిత కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నారావారి కోడలు బ్రాహ్మణి కేవలం సామాజిక సేవలోనే ఉంటారా లేక మెల్లిగా రాజకీయాల్లోకి కూడా వస్తారా అన్నది ఇప్పటికైతే సస్పెన్సే.
అయితే, బ్రాహ్మణి రాజకీయాల్లోకి కూడా వస్తే బాగుంటుందని కుటుంబ సభ్యులతో పాటు టిడిపి యువతలో కూడా బలంగా డిమాండ్ మొదలైనట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణిని స్టార్ క్యాంపైనర్ గా రాష్ట్రంలో తిప్పాలని కూడా ఇప్పటి నుండే డిమాండ్ మొదలైంది. 2019 ఎన్నికలు సమీపిస్తుండటం, బ్రాహ్మణి కూడా సేవా కార్యక్రమాల జోరు పెంచుతుండటం గమనార్హం.
