ఒంగోలు: తనను తిట్టిందనే కోపంతో ఓ 16 ఏళ్ల కుర్రాడు 65 ఏళ్ల మహిళ పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. దుర్మార్గానికి ఒడిగట్టాడు. దాడి చేసి మహిళను చితకబాదాడు. గొంతుకు కండువా బిగించి, బండరాయితో తలపై మోది ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత శవంతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. 

ఆ తర్వాత ఎవరూ గుర్తించకుండా శవంపై బిందు సేద్యం పైపులు, చెత్త వేసి వెళ్లిపోయాడు. తర్వాత రోజు కూడా అతను అక్కడే పనిచేశాడు. తల్లి ఆచూకీ కోసం ఆమె కుమారుడు గాలిస్తుంటే ఏమీ తెలియనట్లు నటించాడు. పోలీసుల దర్యాప్తులో పట్టుపడ్డాడు.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామ శివారులోని బొప్పాయి తోటలో ఆ సంఘటన ఈ నెల 14వ తేదీన చోటు చేసుకుంది. అత్యాచారానికి, హత్యకు గురైన 65 ఏళ్ల మహిళ కుమారుడికి రొయ్యల చెరువులున్నాయి. వాటిలో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు కూలీలనను కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి రప్పించాడు. తన స్వగ్రామం మల్లరప్పాడులో తమ బొప్పాయి తోటలో పనిచే కోసం ఇద్దరిని ఈ నెల 13వ తేదీన ఇద్దరిని పంపించాడు. 14వ తేదీన కూడా వారికి అక్కడే పని అప్పగించారు. 

ఈ నెల 14వ తేదీ ఎప్పటిలాగే కాపలా కోసం వృద్ధురాలు బొప్పాయి తోటకు వెళ్లింది. తోట గేటు తీస్తున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న బాలుడితో గొడవ జరిగింది. ఆమె తనను తిట్టిందని కోపంతో బాలుడు దాష్టీకానికి పాల్పడ్డాడు. తోటలో గడ్డి కోస్తున్న ఆమెపై దాడి చేశాడు. ఆమె కిందపడిపోయిది. దాతో మెడకు కండువా బిగించాడు. అప్పటికీ చనిపోకపోవడంతో తలపై బండరాయితో మోదాడు. దాంతో ఆమె మరణించింది. ఆ తర్వాత ఆమె శరీరంతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. 

శవంపై పైపులు, గడ్డి వేశాడు. తన తల్లి ఇంటికి రాకపోవడంతో కుమారుడు పలు చోట్ల గాలించాడు.చివరకు బొప్పాయి తోటలో ఆమె మృతదేహం కనిపించింది. దాంతో అతను టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజు తోటలో పనిచేసిన పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాకు చెందిన బాలుడు హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో జువెనైల్ హోంకు తరలించారు.