ఇళ్ల గురించి మేనిఫెస్టోలో ఏం చెప్పామో టీడీపీ నాయకులు చూసూకోవాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) అన్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నాయకులు చేసిన అవినీతిని సరిచేసి ఇస్తున్నామని  చెప్పారు. 

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) సవాలు విసిరారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ప్రభుత్వంపై, మంత్రులపై మాటల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్టీపీసీకి, ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చిందని.. రెండు రోజులు పాటు ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ఇబ్బంది లేదని తాను చెప్పలేదన్నారు. సమస్య అయిపోయిన తరవాత కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని.. చంద్రబాబు నాయుడు (atchannaidu naidu), అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. 

ఇళ్ల గురించి మేనిఫెస్టోలో ఏం చెప్పామో టీడీపీ నాయకులు చూసూకోవాలని బొత్స అన్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నాయకులు చేసిన అవినీతిని సరిచేసి ఇస్తున్నామని చెప్పారు. పేదల ఇళ్ల విషయంలో అచ్చెన్నాయుడు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నరాని విమర్శించారు. ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలను అచ్చెన్నాయుడు చూపించాలని కోరారు. అచ్చెన్నాయుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సవాలు విసిరారు. టీడీపీ హయాంలో ఇళ్లనిర్మాణంలో కమిషన్ కోసమే నిర్మాణం చేసి వదిలేశారని ఆరోపించారు. 

టిడ్కో నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ చేసి ప్రభుత్వానికి రూ. 400 వందల కోట్లు మిగిల్చామని చెప్పారు. టిడ్కో ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కరెంట్, రోడ్‌లు, నీరు, మరుగుదొడ్లు వంటివి చంద్రబాబు నిర్మించకపోవడం వలన లబ్ధిదారులకు అప్పగించలేదని తెలిపారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్దిదార్లుకి అప్పగిస్తున్నామని చెప్పారు. 

చెత్త పన్ను మీద రాద్ధాంతం తగదని బొత్స అన్నారు. పేదల నుండి పన్ను వసూలు చేయడం లేదన్నారు. సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి మృతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. లేని పేర్లను చేరుస్తూ ప్రజల్లో ఒక అపోహ సృష్టించడానికి టీడీపీ ప్లాన్ చేస్తుందని విమర్శించారు.