Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్: టీడీపీపై మండిపడ్డ బొత్స

ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాలు పంచే కార్యక్రమం వాయిదా పడడంపై మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై మండిపడ్డారు. పేదలకు ఇళ్లు పంచుతుంటే కోర్టులను ఆశ్రయించి టీడీపీ అడ్డుకుంటోందని ఆయన అన్నారు.

Botsa Satyanarayana blames TDP for stalling house sites distribution
Author
Vijayawada, First Published Jul 6, 2020, 2:00 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై మండిపడ్డారు. విజయవాడ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. 

సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగర అభివృద్ధి కి చేయమని అదేశించారని ఆయన అన్నారు.సింగ్ నగర్ లో 10 కోట్ల తో మోడల్ పార్క్ అభివృద్ధి కి శంఖుస్థాపన చేశామని, అదనపు నిధులు ఇస్తామని, ఏడాది లోపు పూర్తి చేస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇక్కడ ఉన్న డంప్ యార్డ్ లో అత్యాధునికంగా, ఆదర్శంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

రాష్ట్రంలో పేదలకు మంచి చేసే ప్రతిపని అడ్డుకుని  ప్రతిపక్షం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు.  మొదట 25 లక్షలు అనుకున్నామని, 30 లక్షలు పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారని ఆయన చెప్పారు. భూములు స్వచ్చందంగా ఇచ్చారని, భూసేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. 

కోర్టుల నుంచి స్టే  తీసుకు వచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని, టీడీపీ  చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని, ప్రతి పేదవాడు టిడిపి చేస్తున్న కుట్రలు గమనించాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం లో ఒక్క ఇంటి నిర్మాణమైనా చేపట్టారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి ఇవ్వడానికి చూస్తుంటే.. టీడీపీ కుట్ర చేస్తోందని అన్నారు. 

నాడు దివంగత నేత వైఎస్ ఆర్ ప్రతి పేదవాడికి ఇళ్లను అందిస్తే.. అదే స్ఫూర్తితో నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధం అయ్యారని బొత్స అన్నారు. టీడీపీ నేతలు పర్యటనపై బొత్స మండిపడ్డారు. ఈరోజు ఇవ్వాల్సిన పేదలు ఇళ్ల పట్టాలు ఆలస్యం కావచ్చేమో గానీనీ,ఇవ్వడం మాత్రం పక్కాగా అందిస్తామని చెప్పారు. రివర్స్ టెండర్లు ద్వారా 400 కోట్లు  ఆదా చేశామని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios