తిరుపతి: రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని జరుగుతున్న ఆందోళన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్నాలు, దీక్షలు చేయాలంటూ చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.

ఉద్యోగులను ఉసిగొల్పుతున్నారని బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అసహనంతో ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు. 

Also Read: బోస్టన్ తో విజయసాయి అల్లుడికి లింక్, అదో చెత్త: చంద్రబాబు

రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో అందరికీ తెలుసునని, అధికార వికేంద్రీకరణ జరపాలని చెప్పిందని ఆయన అన్నారు. నాలుగు పంటలు పండే చోట రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని, ఆ కమిటీ నివేదికను చంద్రబాబు మరోసారి చదువుకోవాలని ఆయన అన్నారు. నారాయణకు ఏం తెలుసునని ఆయన నేతృత్వంలో కమిటీ వేశారని బొత్స చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు రైతుల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచంలోనే బోస్టన్ కన్సల్టెన్సీ కంపెనీ మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో బోస్టన్ కన్సల్టెన్సీతో చంద్రబాబు గతంలో ఎంవోయూ చేసుకున్నారని, పనికిమాలిన కమిటీతో ఎందుకు ఎంవోయు చేసుకున్నారని ఆయన అన్నారు.

Also Read: మీ ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా: జగన్ ను ప్రశ్నించిన చంద్రబాబు

రాజధాని నిర్మాణానికి 3 వేల కోట్ల టెండర్లు చాలునని చంద్రబాబు అంటున్నారని, అలా అయితే 82 వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఎలా పిలిచారని, కన్సల్టెన్సీలకే 842 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన అన్నారు.