పోలీసుల సంరక్షణలో ఆనందయ్య: పది రోజుల పాటు కరోనా మందుకు బ్రేక్
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు బ్రేక్ పడింది. దాదాపు పది రోజుల పాటు ఆనందయ్య మందుకు బ్రేక్ పడింది. ప్రభుత్వ అధికారిక ప్రకటన తర్వాతనే పంపిణీకి అవకాశం ఉంటుంది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు బ్రేకు పడింది. పది రోజుల పాటు ఆ కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ఆగిపోనుంది. శనివారం ఉదయం పోలీసులు ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్నారు.
పోలీసులు ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆనందయ్య పోలీసుల సంరక్షణలో ఉన్నారు. కృష్ణపట్నం ఏవరూ రావద్దని పోలీసులు విజ్ఞుప్తి చేశారు. అటు వైపుగా వస్తున్న వాహనాలను నిలిపేస్తున్నారు.
Also Read: ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య అరెస్ట్ అంటూ కథనాలు: నెల్లూరు జిల్లా ఎస్పీ క్లారిటీ
ఈ రోజు ఐసిఎంఆర్ బృందం కృష్ణపట్నం చేరుకోనుంది. ఇప్పటికే ఆయుష్ కమషనర్ రాములున ఆధ్వర్యంలో మందుపై అధ్యయనం కొనసాగుతోంది. రాములు ఎదుట ఆనందయ్య ఆయుర్వేద మందు తయారు చేసి చూపిస్తారు. ఆధ్యయనం పూర్తి అయిన తర్వాతనే మందు పంపిణీకి అనుమతి ఇవ్వనున్నారు. ఆనందయ్య సామగ్రి మొత్తాన్ని నెల్లూరుకు తరలించారు.
Also Read: ఆనందయ్య కరోనా మందు.. సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ: ఏకే సింఘాల్ వ్యాఖ్యలు
ఆనందయ్య కరోనా మందు కోసం ప్రజలు పెద్ద యెత్తున ఎగబడిన విషయం తెలిసిందే. కృష్ణపట్నం గ్రామానికి వేలాది ప్రజలు తరలి వచ్చారు. వారిని నియంత్రించడం కూడా పోలీసులకు సాధ్యం కాలేదు. ఆనందయ్యకు స్థానిక శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మద్దతు పలుకుతున్నారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు.
ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాతనే మందు తీసుకోవడానికి రావాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.