ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య అరెస్ట్ అంటూ కథనాలు: నెల్లూరు జిల్లా ఎస్పీ క్లారిటీ

కరోనా రోగులకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న బొనిగి ఆనందయ్యను అరెస్ట్ చేశారంటూ వాస్తున్న వార్తలపై స్పందించారు నెల్లూరు జిల్లా ఎస్పీ. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా ఆనందయ్యకు అనదపు భద్రత కల్పించామని ఆయన స్పష్టం చేశారు. 

nellore district sp clarifies anandaiah arrest ksp

కరోనా రోగులకు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న బొనిగి ఆనందయ్యను అరెస్ట్ చేశారంటూ వాస్తున్న వార్తలపై స్పందించారు నెల్లూరు జిల్లా ఎస్పీ. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా ఆనందయ్యకు అనదపు భద్రత కల్పించామని ఆయన స్పష్టం చేశారు. 

కాగా, కరోనాతో ప్రజలు అల్లాడుతున్న వేళ.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని తీసుకున్న వారిలో సత్ఫలితాలు వస్తున్నాయంటూ ప్రచారం జరగడంతో జనం భారీగా వాహనాల్లో తరలివచ్చారు.

Also Read:ఆనందయ్య కరోనా మందు.. అన్ని కోణాల్లో పరిశీలన, రెండ్రోజుల్లోనే నివేదిక: ఆయుష్ కమీషనర్

దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం ఆయుర్వేద ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని ఆయన వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే... ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని చక్రధర్ బాబు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios