Asianet News TeluguAsianet News Telugu

బోండా ఉమామహేశ్వర రావు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Bonda Umamaheswara Rao Biography: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టిడిపి తరఫున బోండా ఉమామహేశ్వర రావు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు రియల్ స్టోరీ తెలుసుకుందాం. 

Bonda Umamaheswara Rao Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 29, 2024, 1:04 PM IST

Bonda Umamaheswara Rao Biography: ఏపీలో విజయవాడ రాజకీయాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ ప్రాంతం నుంచి వచ్చే ఏ రాజకీయ నాయకుడైనా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇక ఎన్నికల వేళ ప్రతిష్టాత్మకంగా భావించే విజయవాడ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని ప్రతి రాజకీయ పార్టీ  భావిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ కూడా నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. అలాంటి  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టిడిపి తరఫున మాస్ లీడర్ బోండా ఉమామహేశ్వర రావు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రియల్ స్టోరీ తెలుసుకుందాం. 

బొండా ఉమామహేశ్వరరావు .. 1966 జనవరి 30న బొండా కనకారావు-పుష్పవతి దంపతులకు జన్మించారు. ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఉమామహేశ్వరరావు అంచెలంచెలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగినా తీరు ఆయనను మాస్ లీడర్ గా పేరు తెచ్చిపెట్టింది. ఈ తరుణంలో పార్టీ అధినేత ద్రుష్టిని ఆకర్షించిన బోండా ఉమామహేశ్వర రావుకు 2014లో విజయవాడ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి పై 27,161 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

అదే సమయంలో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు బోండా ఉమామహేశ్వర రావు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేసి, విజయవాడ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా విజయవాడ సెంట్రల్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే..టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. 

ఇక బొండా ఉమామహేశ్వరరావు  కుటుంబం విషయానికి వస్తే.. ఆయన సుజాత గారిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. బోండా సిద్ధార్థ, బోండా రవితేజ. అలాగే రాయలసీమలోని ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరు ఇయ్యంకులు. ఏవి సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతిని బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థకి ఇచ్చి వివాహం జరిపించారు. 2024 ఎన్నికల్లో మరోసారి విజయవాడ సెంట్రల్ నుండి టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios