ముంబై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నానికి చెందిన అనూహ్యపై రేప్ చేసి హత్య చేసిన నిందితుడు చంద్రభానుకు ఉరి శిక్ష విధిస్తూ ముంబై కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నానికి చెందిన అనుహ్య 2014 జనవరి ఐదో తేదీన హత్యకు గురైంది. జనవరి 16 వతేదీన ఆమె మృతదేహం దొరికింది. ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అనుహ్య పని చేసేది. క్రిస్మస్ సెలవుల కోసం మచిలీపట్నానికి వచ్చింది. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ముంబైకి వెళ్లిన సమయంలో హత్యకు గురైంది.

ఉద్యోగం కోసం ముంబైకు వెళ్లిన అనుహ్యకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి చంద్రభాను అనే డ్రైవర్ ఆమెను తీసుకెళ్లాడు.  ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనపై  2015 డిసెంబర్ లో సెషన్స్ కోర్టు జీవిత మరణశిక్ష విధించింది.

అనుహ్యను హత్య చేసిన తర్వాత  ఆమె వస్తువులను చంద్రబాను కొందరికి దానం చేశారు. ఈ కేసులో ముంబై పోలీసులు వ్యవహరించిన తీరుపై అప్పట్లో విమర్శలు చేలరేగాయి.

సెషన్స్ కోర్టు తీర్పుపై చంద్రభాను హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. అనుహ్యపై రేప్ చేసి హత్య చేసిన చంద్రభానుకు మరణశిక్షను విధించింది.ఈ తీర్పుపై అనుహ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.