రాయలసీమలో విషాదం... నాటుబాంబులు పేలి ఇద్దరు మృతి, ఏఎస్ఐకి గాయాలు

First Published 31, Jul 2018, 3:35 PM IST
Bomb Blast At Kurnool Dist
Highlights

గతంలో ఎప్పుడో, ఎవరో పాతిపెట్టిన నాటుబాంబులు పేలి ఇద్దరు రైతు సోదరులు మృతిచెందారు. వ్యవసాయమే జివనాధారంగా బ్రతుకుతున్న వీరు తమ పొలంలో కొలతలు చేపడుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ పేలుళ్లు రాయలసీమలోని నంద్యాల ప్రాంతంలో జరిగాయి.

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని జోహానాపురం గ్రామంలో జంపాల మల్లాఖార్జున్, జంపాల రాజశేఖర్ అనే ఇద్దరు అన్నదమ్ములు నివాసముంటున్నారు. తమకు వారసత్వంగా వచ్చిన పొలంలో ఇవాళ కొలతలు చేపడుతుండగా భూమిలో పాతిపెట్టిన నాటుబాంబులు పేలాయి. దీంతో మల్లిఖార్జున్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజశేఖర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. మరో క్షతగాత్రుడు విజిలెన్స్ ఏఎస్ఐ శ్రీను పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అయితే పొలంలో ఈ నాటుబాంబులు ఎవరు పాతారో అర్థం కావడం లేదని మృతుల కుటుంబీకులు తెలిపారు. ఎవరో చేసిన పనికి తమవారు బలయ్యారంటూ కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అసలు ఈ నాటుబాంబులు పొలంలోకి ఎవరు పాతిపెట్టారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader