కారుని ఆపి తనిఖీ చేసిన బాంబు స్క్వాడ్

రాష్ట్ర దేవాదాయశాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు కారులో బాంబు ఉందంటూ శుక్రవారం తాడేపల్లిగూడెంలో కలకలం రేగింది. బాంబు ఉందంటూ కొందరు మీడియా ప్రతినిధులు చెప్పడంతో పట్టణ పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎ్‌సఎన్‌ మూర్తి, ఎస్‌ఐ కేవి రమణ తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.