గోదావరి నదిలో మునిగిన బోటును బయటకు తీయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందుకోసం నేవీ కోస్ట్ గార్డ్ సహా చాలా సంస్థలు ప్రయత్నం చేసి రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. చివరకు ధర్మాడి సత్యం బృందానికి ఈ పనిని అప్పగించింది ప్రభుత్వం. 

ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా బోటు తీయలేకపోతున్నారు. వాతావరణం కూడా సహకరించడం లేదు. గతంలో బొట్టును బయటకు తీసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరిన సాహసవీరుడు శివ మరోమారు మీడియా ముఖంగా సవాల్ విసిరాడు. 

తనకు అవకాశం ఇస్తే రెండు గంటల్లోనే మునిగిన బొట్టును బయటకు తీస్తానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ మరోసారి సవాల్ చేసాడు. ప్రభుత్వం పంపిన సహాయక బృందాలు ఖచ్చితంగా శివ సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ధర్మాడి సత్యం బృందం తన మాటను పట్టించుకోవడం లేదని అన్నాడు. 

తను గనుక బొట్టును తీయలేకపోతే ప్రభుత్వం తనకు ఇచ్చిన అన్ని అవార్డులను వెనక్కిచ్చేస్తానని ఛాలెంజ్ విసురుతున్నాడు శివ. వందకు వంద శాతం బొట్టును బయటకు తీయగలనన్న నమ్మకం ఉండబట్టే ఇలా ఛాలెంజ్ చేస్తున్నట్టు చెప్పాడు.