తూర్పుగోదావరిలో విషాదం.. గోదావరిలో నాటు పడవ బొల్తా.. పడవలో 30 మంది

boat capsizes in Godavari Near mummidivaram
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. గోదావరిలో నాటు పడవ బొల్తా పడింది. ముమ్ముడివరం మండలం పశువులలంక వద్ద ప్రయాణికులతో వెళుతున్న పడవ బొల్తాపడింది

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. గోదావరిలో నాటు పడవ బొల్తా పడింది. ముమ్ముడివరం మండలం పశువులలంక వద్ద ప్రయాణికులతో వెళుతున్న పడవ బొల్తాపడింది.  ప్రమాదాన్ని చూసిన స్థానికులు, మత్య్సకారులు 10 మందిని సురక్షితంగా తీసుకొచ్చారు. కాగా, ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారన్న అంశంపై స్పష్టత లేదు.. అయితే 30 మంది వరకు ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు... ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. 
 

loader