Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళం జిల్లాలో బాణసంచా తయారీ చేస్తున్న సమయంలో పేలుడు: ఇద్దరికి గాయాలు


శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కచేరి వీధిలో ఓ ఇంట్లో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Blast in Kacheri Veedhi in Srikakulam District
Author
Srikakulam, First Published Nov 3, 2021, 3:22 PM IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా Tekkali మండలం Kacheri Veedhi లో ఓ ఇంట్లో బుధవారం నాడు Blast చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.కచేరి వీధిలోని ఇంట్లో  బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాాల్సి ఉంది.

also read:బాణసంచా వాడకంపై యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కీలక ఆదేశాలు.. ఎన్సీఆర్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో నిషేధం..

గతంలో కూడా ఇంట్లో బాణసంచా చేస్తున్న సమయంలో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహ ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని  శ్రీకాకుళం జిల్లాలో 2016  ఏప్రిల్ 18న గురువాంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ఇద్దరు మరణించారు.  మరో ఏడుగురు గాయపడ్డారు.

ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన విశాఖ జిల్లా రావికమతం మండలం మేడివాడలో ఓ ఇంట్లో అనధికారికంగా బాణసంచా తయారు చేస్తున్న క్రమంలో పేలుడు వాటిల్లింది.ఈ ఘటనలో ఓ వృద్దురాలు సజీవదహనం కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.2019 అక్టోబర్ మాసంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు బాణసంచా కేంద్రంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి.

తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో బాణసంచా దుకాణంలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. దీపావళిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ దుకాణంలో బాణసంచాను నిల్వ ఉంచారు. అయితే ఈ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు చోటు చేసుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios