12 మంది బలి: ఆ క్వారీలు టిడిపి నేతవే (వీడియో)

Blast at stone quarry in Andhra Pradeshs Kurnool, 12  killed
Highlights

కర్నూలు జిల్లా క్వారీ ప్రమాదంలో వలస కూలీలు బ్రతుకులు కాలిబూడిదయ్యాయి. ఈ దుర్ఘటనలో జార్ఖండ్ నుండి పొట్టచేతపట్టుకుని వచ్చిన 12 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. క్వారీల్లోనే గుడిసెలు వేసుకుని జీవిస్తున్న కూలీలు అదే క్వారీలో సజీవ దహనయ్యారు. భారీ పేలుడు దాటికి చాలా మంది క్షతగాత్రులయ్యారు. వారంతా ప్రస్తుతం కాలిన గాయాలతో నరకం అనుభవిస్తూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామ సమీప కొండల్లో రెండు క్వారీలను ఏరూరుకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాస చౌదరి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఈ క్వారీల్లోని నల్లరాళ్లను భారీ మందుగుండు సామాగ్రి ఉపయోగించి ముక్కలు చేసి కంకరగా మారుస్తారు. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తుంటారు. అయితే ఈ క్వారీల్లో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలు అక్కడే గుడిసెలె వేసుకుని జీవిస్తున్నారు. శుక్రవారం రాత్రి వారు వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అవి కాస్తా పేలుడు పదార్థాలకు అంటుకుని భారీ పేలుళ్లకు కారణమయ్యాయి. 

ఈ మంటల్లో లారీ, మూడు ట్రాక్టర్లు కూడా మంటల్లో ఆహుతయ్యాయి.  ఇక ఈ ప్రమాదంలో చిక్కుకున్న కూలీల శవాలన్ని పూర్తిగా కాలిపోయి భయంకర వాతావరణాన్ని సృష్టించాయి.ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందడంతో పాటు ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

వీడియో

సంబంధిత వార్తల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

https://telugu.asianetnews.com/andhra-pradesh/blast-at-hattibelagal-in-kurnool-district-pcw72p

loader