Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లా క్వారీలో భారీ పేలుడు: 12 మంది మృతి

కర్నూల్ జిల్లాలోని ఆలూరు మండలంలోని హత్తి బెళగల్ లోపేలుడు సంభవించింది. 12 మందికి పైగా మృతి చెందారు.

blast at Hattibelagal in Kurnool district


కర్నూల్: కర్నూల్ జిల్లాలోని ఆలూరు మండలంలోని హత్తి బెళగల్ లోపేలుడు సంభవించింది. ఈ సంఘటనలో మృతుల సంఖ్య 12కు చేరుకుంది..ఎనిమిది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఆలూరు మండలంలోని హత్తిబెళగల్ లో శుక్రవారం రాత్రి ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు.
పేలుడు ధాటికి మంటలంటుకొని మూడు ట్రాక్టర్లు, ఓ లారీ దగ్దమైంది. మరో షెడ్డు కూడ దగ్థమైంది.

పేలుళ్ల గురించి సమాచారం ఇచ్చిన కూడ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
క్వారీలో ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 కార్మికులు క్వారీలో ఉన్నారు.మృతులు బీహార్ ,పంజాబ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.

భారీ  పేలుళ్లకు హత్తిబెళగల్, ఆలూరు, ములగపల్లిలో ,కురవపల్లి, అగ్రహారం గ్రామాల్లోని ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. క్వారీలో పేలుడు సమయంలో భారీగా శబ్దం రావడంతో హత్తిబెళగల్ వాసులు భయంతో ఇళ్లలో నుండి పరుగులు తీశారు.

శ్రీనివాస్ చౌదరికి చెందిన క్వారీగా స్థానికులు చెబుతున్నారు. క్వారీలో పేలుడుతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.షెడ్డులో ఇంకా కార్మికులు చిక్కుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఇప్పటికే పది మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 
ఆలూరు ప్రమాదం పట్ల సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

ఈ క్వారీకి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అనుమతి లేకున్నా ఈ క్వారీని  కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే సహాయక చర్యలు చేపట్టిన సమయంలో వర్షం కురిసింది. ఈ వర్షం కురవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

మూడు గ్రామాలకు సమీపంలో ఉన్న క్వారీని మూసివేయాలని ఆందోళన చేసినట్టు ఆలూరు ఎమ్మెల్యే జయరాములు చెప్పారు. అధికార పార్టీకి చెందిన సంబంధాలు ఉన్నందునే ఈ క్వారీని మూసివేయకుండా నడిపిస్తున్నారని ఎమ్మెల్యే జయరాములు ఓ మీడియా ఛానెల్ కు వివరించారు.

గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. దీని పక్కనే కంకర మిషన్లు ఉన్నాయి.ఇతర రాష్ట్రాల నుండి ఫ్యాక్టరీలో కార్మికులను విధుల్లోకి తీసుకొన్నారు.స్థానికులు మాత్రం ఇక్కడ పనిచేస్తే ఇబ్బందులు ఉంటాయని భావించి ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు విధుల్లోకి తీసుకొంటారు.

మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకొందని హత్తిబెళగల్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్వారీని మూసివేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు.బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కలెక్టర్ కు సూచించారు.
బాధిత కుటుంబాలను ఆదుకొంటామని డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. ఈ ఘటనపై డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios